హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తెనాలి మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

గుంటూరు: తెనాలి మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ఛైర్మన్ తోటకూర వెంకట రమణారావుతో పాటు 52 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సభా వేదిక సిద్ధం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిల్ హాలులో వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.