అన్నమయ్య: మదనపల్లె డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం రెండో రోజు కొనసాగింది. తొలి రోజు శనివారం సర్పంచ్ స్థానాలకు 229 మంది, వార్డు సభ్యుల కోసం 234 మంది నామినేషన్లు వేశారు. రెండో రోజు కూడా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల గడువు ముగిసినా రాత్రి వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.
ఆంధ్రప్రదేశ్
నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు


