హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల దాడుల్లో 184 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం

అన్నమయ్య: కల్లూరు (సదుం) పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిచెర్లలో పోలీసులు దాడులు నిర్వహించి 184 అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 150 మద్యం సీసాలు, 34 బీర్లు ఉన్నాయి. అక్రమంగా మద్యం అమ్ముతున్న సురేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పాకాల కోర్టుకు తరలించినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకటసుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.