హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ఏలూరులో రైలు ఢీకొని ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. రామకృష్ణాపురం సమీపంలో సుమారు 45-50 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఆదివారం రైలు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.