హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే ఏడాదిలో మేయర్ పీఠంపై భార్యభర్తలు!

గుంటూరు కార్పొరేషన్ మేయర్ కుర్చీలో ఒకే ఏడాదిలో ఒకే కుటుంబసభ్యులు ఆసీనులు కావడం విశేషం. 2025 ఏప్రిల్ 28న మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర బాధ్యతలు స్వీకరించి ఈ ఏడాది మార్చి 17 వరకు కొనసాగారు. తాజాగా ఆయన సతీమణి లక్ష్మీ అపర్ణ మేయర్ అయ్యారు. ఈ ఏడాది మొదట్లో రవీంద్ర మేయర్‌గా ఉండగా ఏడాది చివరిలో ఆయన భార్య మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.