హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి దివ్యాంగులకు ప్రత్యేక శిబిరం

AKP: దివ్యాంగులకు కృత్రిమ అవయవాల వితరణకు ఈనెల 23 నుంచి 26 వరకు భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో హరిపురంలోని ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి శ్రీమూర్తి చెప్పారు. బీసీటీ ఆర్థిక సహాయంతో మెడిటెక్ జోన్ నిపుణుల సహకారంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 132 మంది దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించేందుకు కొలతలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.