హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ యూపీఐతో మోసం.. నిందితుడి అరెస్ట్

ADB: ఆదిలాబాద్‌లోని హరిహర పెట్రోల్ బంకులో రూ.300 పెట్రోలు పోయించుకుని, రూ.3,000 నకిలీ యూపీఐ పేమెంట్ చూపించి మిగతా నగదు కోసం మోసానికి యత్నించిన నవాజ్‌ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు DSP జీవన్ రెడ్డి ఆదివారం తెలిపారు. నిర్వాహకుడు డబ్బులు జమ కాలేదనడంతో గొడవ పడినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.