హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి

E.G: తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలోని ఎల్దబీ హోమ్కు చెందిన పురాతన భవనంలో సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.