హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గాడ శివాలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం

KKD: దుర్గాడలోని శివాలయంలో స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న 108 రోజుల భజన కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర దీపారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరుల ఆధ్వర్యంలో శివయ్యకు శ్రీవెంకటేశ్వర స్వామి అలంకరణ చేసి దీపారాధన, పుష్పమాలలతో అలంకరణ చేశారు.