హైదరాబాద్: 28°C
తెలంగాణ

కప్పర్లలో భక్తిశ్రద్ధలతో కాకడ హారతి కార్యక్రమం

ADB: తాంసి మండలంలోని కప్పర్ల శ్రీరామ మందిరంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని కాగడ హారతి కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు విశాల్ శర్మ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రజలందరూ భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.