WGL: వరంగల్ నగరంలో ఆదివారం ధర్మ సమాజ్ పార్టీ సహకారంతో జిల్లా మాదిగ జాగృతి సంఘం ఆధ్వర్యంలో మాదిగ మహారాజుల శోభాయాత్ర నిర్వహించారు. పోచమ్మ మైదాన్ కూడలి నుంచి ఎంజీఎం ఆసుపత్రి రోడ్డు, ములుగు రోడ్డు, హనుమకొండ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ కూడలి వరకు యాత్ర సాగింది. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డా. విశారదన్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు.
తెలంగాణ
వరంగల్లో ఘనంగా మాదిగ మహారాజుల శోభాయాత్ర


