హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నెల్లిమర్లలో శివలింగానికి అభిషేకాలు

VZM: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా.. నెల్లిమర్ల నగర పంచాయతీ గాంధీ నగర్ కాలనీ శిరిడి సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న శివాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయానికి చేరుకొని శివనామ జపంతో ప్రదక్షిణలు చేసి, పళ్ళు, కాయలు అభిషేకాలు శివలింగానికి సమర్పించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.