చిత్తూరు నగరపాలక సంస్థ నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారన్నారు. సమావేశ మందిరంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం


