హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రిశూల్ కార్యక్రమంలో ఎన్నికలపై అవగాహన

VZM: మెరకముడిదాం SI లోకేష్ ఆదివారం రాత్రి స్థానిక యాడికలో త్రిశూల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలు చోటులేకుండా సజావుగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని గ్రామస్థులను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు .