హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకిలీ పోలీసుల దోపిడీ.. ఇద్దరి అరెస్ట్

ATP: పోలీసులమంటూ నకిలీ గుర్తింపు కార్డులతో వాహనదారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న గుంతకల్లుకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ (24), జె. అలీ అబ్బాస్ (27)లను కంబదూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21న వై.సి.పల్లి వద్ద వృద్ధుడిని బెదిరించి రూ.5,500 దోచుకున్న కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐడీ కార్డు, కత్తి, బైక్, నగదు స్వాధీనం చేసుకున్నారు.