SS: నటి సాయి పల్లవి పుట్టపర్తికి విచ్చేశారు. ఆమె సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సాయి పల్లవికి స్వాగతం పలికి బాబా చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సాయి కుల్వంత్ హాలులో కాసేపు ధ్యానం చేశారు. సాయి పల్లవిని చూసేందుకు భక్తులు, అభిమానులు ఆలయ ప్రాంగణంలో ఆసక్తి కనబరిచారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో సాయి పల్లవి ప్రత్యేక ప్రార్థనలు


