హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరకోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడురోజుల్లో తూర్పుగాలులు బలపడనున్నాయని పేర్కొంది. రేపటి నుంచి తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.