హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని భేటీ

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేపాల్‌ ప్రధానమంత్రి బాలేంద్ర షా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీతో ఇవాళ ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇంధనం, జలవిద్యుత్‌, రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. పలు ఒప్పందాలపై వీరి సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది.