హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నంద్యాల రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ నూతన పాలకమండలి నేడు కొలువుదీరనుంది. ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి, 52 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రాఘవరెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు.