SRCL: వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా కొనసాగుతోంది. 12వ రోజు ఆదివారం వేడుకలను ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు వివిధ ఆకృతులలో దీపాలను వెలిగించారు. సుహాసినుల ఆధ్వర్యంలో దీపోత్సవం జరుగుతోంది. మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, వాయనం అందజేశారు.
తెలంగాణ
వైభవంగా కార్తీక దీపోత్సవం


