హైదరాబాద్: 28°C
వార్తలు

చైనా సరిహద్దు గ్రామాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి మారుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గతంలో ఉపాధి, మౌలిక సదుపాయాల కొరతతో గ్రామాలను విడిచి వెళ్లిన.. సుమారు 40 గ్రామాల ప్రజలు తిరిగి వచ్చారన్నారు. వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా చైనా సరిహద్దు గ్రామాల్లో.. రోడ్లు, కరెంట్, మంచి నీరు, విద్య, వైద్యం, ఉపాధి సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.