హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఒక్కరి ప్రవర్తన గమనిస్తున్నాం: రేవంత్ 

TG: పార్టీలో ప్రతి ఒక్కరి ప్రవర్తన, మాట తీరును నిశితంగా గమనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏ నాయకుడు ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనుక ఏం మాట్లాడుతున్నారో పార్టీ దగ్గర సమాచారం ఉందన్నారు. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకు ఒకసారి వస్తుందన్నారు. పార్టీలో కష్టపడిన వాళ్లను గుర్తిస్తామని.. కష్టపడి చెడగొట్టే వాళ్లను కూడా కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామన్నారు.