నెదర్లాండ్స్ విదేశాంగమంత్రి టామ్ బెరెండ్సెస్ ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కలిసి తొలి విదేశాంగమంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని కేంద్రం తెలిపింది.
వార్తలు
ఢిల్లీ చేరుకున్న నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి


