హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

GNTR: తెనాలి నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఆదివారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో బుర్రిపాలెం, అత్తోట, సిరిపురం గ్రామాల్లో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు. ఓటర్లు భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.