హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌కు 3,000 మంది భారతీయులు.. ఎందుకంటే?

సిక్కు మత వ్యవస్థాపకులు శ్రీ గురునానక్ 557వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు 3,000 మంది భారతీయ సిక్కులు పాక్‌కు వెళ్లారు. ఇప్పటికే 700 మంది సరిహద్దు దాటారు. పంజాబ్ నన్కానా సాహిబ్ పట్టణంలో గురునానక్ జన్మించారు. ఏటా అక్కడ గురుద్వారాలను సిక్కు యాత్రికులు సందర్శిస్తారు. 1974 నాటి ఒప్పందం ప్రకారం స్పెషల్ రిలీజియస్ పిలిగ్రిమేజ్ ప్రొటోకాల్ కింద వీరికి PAK వీసాలు జారీ చేస్తుంది.