హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదానికి ఆహ్వానం!

NGKL: కల్వకుర్తి నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే రూట్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ కారణంగా పలువురు ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపడంతో పాటు ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.