హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లోనే ప్రసవమైన గర్భిణీ

ADB: నార్నూర్ మండలంలోని దేవరిగూడ గ్రామానికి చెందిన గర్భిణీ పార్వతబాయి ఆదివారం తమ ఇంటిలోనే ప్రసవమైంది. ఈఎంటీ ప్రదీప్, పైలెట్ షేక్ సాహిద్ వివరాల ప్రకారం.. గర్భిణికి పురిటినొప్పులు రావడంతో 108కు సంప్రదించారు. అప్పటికే ఆమె ప్రసవమవడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.