హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాచారం గుట్టలో వైభవంగా కార్తీక దీపోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆకాశ దీపారాధన, కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో రంగాచారి ఆధ్వర్యంలో కమలం, లింగం, త్రిశూలం, గోవు ఆకారాల్లో దీపాలను వెలిగించారు. ఈ వేడుకల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు.