హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలాలిలో గంజాయి విక్రేత పట్టివేత

MDCL: మౌలాలి హెచ్‌బీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న వరాల మహేందర్ (37)ను ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జై భవాని టిఫిన్ సెంటర్ సమీపంలో సీఐ గణపతి బృందం తనిఖీలు చేపట్టి అతడి వద్ద 419 గ్రాముల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కాప్రా ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.