హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమ గాయని నుంచి అంతర్జాతీయ వేదిక వరకు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన సంధ్య తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. చదువుతో పాటు ఖోఖో, అథ్లెటిక్స్‌లోనూ రాణించారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం పొందిన ఆమె, తన పాటలతో అమెరికా తానా సభలోనూ అలరించారు. జిల్లా ఉత్తమ గాయనిగా రెండుసార్లు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం సామాజిక అంశాలపై పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.