హైదరాబాద్: 28°C
తెలంగాణ

డంపింగ్ యార్డ్‌పై మల్లారెడ్డి సమరశంఖం

MDCL: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై దమ్మాయిగూడలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే మల్లారెడ్డి మద్దతు ప్రకటించారు. డంపింగ్ యార్డ్ నిర్వహణలో రాంకీ సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రజలు, యువతతో కలిసి మహాధర్నా చేపడతామని హెచ్చరించారు.