హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కింగ్‌ స్థలాలు కరువు.. రోడ్లపైనే వాహనాలు

NLG: మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్‌ పట్టణాల్లో పార్కింగ్‌ సమస్య తీవ్రంగా మారింది. వాహనాల సంఖ్య పెరుగుతున్నా పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దుకాణాల ఆక్రమణలు, అసంపూర్తి అభివృద్ధి పనులు, సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగించడం సమస్యను మరింత పెంచుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.