హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ

GDWL: గట్టు మండలంలో ఆదివారం నిర్వహించిన స్వీపర్ల సమావేశంలో సీఐటీయూ నాయకులు ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ గోడపత్రికను విడుదల చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. DEC 1,2,3కి ఢిల్లీలో నిర్వహించే ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా కార్మికులు అధిక సంఖ్యలో హాజరవ్వాలన్నారు.