హైదరాబాద్: 28°C
తెలంగాణ

టోలిచౌకిలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

HYD: టోలిచౌకి హకీంపేట కుంటలోని మస్జిద్ నూర్-ఎ-ఖుబా సమీపంలో డ్రైనేజీ పొంగిపొర్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.