MDK: కార్తీక మాసం 13వ రోజు సందర్భంగా ఆదివారం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానంలో కార్తీక దీపోత్సవం, సామూహిక దీపారాధన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
తెలంగాణ
VIDEO: ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం


