హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీ జట్లకు ఈ నెల 24న ఎంపికలు

MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనే పాలమూరు యూనివర్సిటీ క్రికెట్, ఫుట్‌బాల్ జట్ల ఎంపికలు ఈ నెల 24న నిర్వహించనున్నారు. ఫుట్‌బాల్ ఎంపికలు పీజీ కళాశాల మైదానంలో, క్రికెట్ ఎంపికలు వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. పి. రమేష్ బాబు హాజరుకానున్నారు.