హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు

మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లు మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపించాయి. ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. ఉదయం రాకపోకలు సాగించినవారు ఇబ్బంది పడ్డారు. ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాలను ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.