హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 28న ఉచిత మెగా వైద్య శిబిరం

ములుగు జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 28న గోవిందరావుపేటలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శిబిరంలో బీపీ, షుగర్, కంటి, దంత, మహిళలు, చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ ఆదివారం తెలిపారు.