హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న ముత్యంపేటలో ఉచిత వైద్య శిబిరం

SDPT: తొగుట మండలం చిన్న ముత్యంపేటలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వరుసగా మూడేళ్లుగా గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.