హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా హ్యాండ్‌బాల్ జట్టుకు 16 మంది ఎంపిక

MBNR: జడ్చర్లలోని బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహిళా హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికల్లో 16 మంది క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఐదు జిల్లాల నుంచి సుమారు 100 మంది పాల్గొన్నారు. ఎంపికైన వారు డిసెంబర్ 4 నుంచి 6 వరకు నల్గొండ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కార్యదర్శి ఆకాంక్షించారు.