హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాదయాత్రకు తరలిరండి: రాజిరెడ్డి

కరీంనగర్‌లో సోమవారం జరిగే బీజేపీ మహా పాదయాత్రకు మానకొండూరు మండలంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, యువత, మహిళలు భారీగా తరలిరావాలని మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆదివారం మానకొండూరులో పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొనే ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.