హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యాలయాలకు వెళ్లేందుకు దారి కరువు!

GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని హరిత టూరిజం సమీపంలో ఉన్న పశువైద్యశాల, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల ముందు మురుగు కాలువ ఉండటంతో సరైన రాకపోకల మార్గం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలువపై వంతెన లేదా స్లాబ్ ఏర్పాటు చేసి సౌకర్యవంతమైన దారి కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.