BHPL: మహాదేవపురం మండలం బోర్లగూడెం గ్రామానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మంజూరైంది. దీంతో ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో నాయకులు బాణసంచా కాల్చి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. PACS ఏర్పాటుతో పరిసర గ్రామాల రైతులకు పంట రుణాలు, ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు.
తెలంగాణ
PACS మంజూరుతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు


