హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌశిక్ రెడ్డి రాజీనామా చేయాలి: ప్రణవ్

KNR: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వోడితల ప్రణవ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4,221 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని, 33,158 మంది రైతులకు రూ.248.5 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. ఆధారాలు చూపినందున ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాజీనామా చేసి, సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.