హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటిని సంరక్షించి భావితరాలకు అందించాలి: కలెక్టర్

ADB: ఆరోగ్య జాతరలో భాగంగా జిల్లాలోని 234 పాఠశాలల్లో విద్యార్థులతో జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించినట్లు కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. నీటి వృథాను అరికట్టి, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ ద్వారా భావితరాలకు జల సంపదను అందించాలని ఆయన పిలుపునిచ్చారు. నీటి పొదుపుపై కుటుంబ సభ్యులు, ప్రజల్లో అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.