హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ కప్‌లో మాధాపురం విద్యార్థినికి ప్రథమ బహుమతి

JN: కలెక్టర్ కప్-2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్‌లో దేవరుప్పుల మండలం మాధాపురం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని డి. సాయి శ్రీ క్యారమ్స్ అండర్-14 బాలికల విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా ట్రోఫీ, ప్రశంసాపత్రంతో పాటు రూ.10 వేల నగదు బహుమతి అందుకుంది. విద్యార్థినిని పలువురు అభినందించారు.