హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొల్వాయిలో ఉచిత వైద్య శిబిరం

JGL: గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం అందించేందుకు ఉచిత శిబిరాలు దోహదపడతాయని రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ డా.శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్పూర్ మండలం కొల్వాయిలో రెడ్‌క్రాస్, మాధవ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత శిబిరం నిర్వహించారు. 221 మందికి పరీక్షించి మందులిచ్చారు. ఆరోగ్యంపై అవగాహన అవసరమని సూచించారు. వైద్యులు నరేష్, రాజశేఖర్, దీపక్, శుభాంగి ఉన్నారు.