హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేక్‌పల్లి ఆలయ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్

MBNR: హాన్వాడ మండలం శేక్‌పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శివాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివలింగం, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.