హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా తులసి దామోదర కల్యాణం

ఉమ్మడి జిల్లా నాగర్ కర్నూల్‌లోని రాంనగర్ కాలనీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆదివారం తులసి దామోదర కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కందడై వరదరాజన్ అయ్యంగారు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈనెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.