హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజన్న ఆలయ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

SRCL: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. గర్భగుడి గోపుర శిఖరాన్ని తొలగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఆలయ ప్రాచీన కట్టడాలు, విగ్రహాల ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలి.